NagnaChithram / Information
మా గురించి / మేనిఫెస్టోAbout / Manifesto
ఇక్కడ నగ్నత్వం అంటే శరీరం కాదు, సత్యం. ముసుగులు లేని జీవితం.Here, nudity does not mean the body, it means the truth. A life without masks.
ఈ ప్రయత్నం ఏమిటిWhat is this endeavor
మన చుట్టూ ఉన్న నిజాన్ని ఎలాంటి మేకప్‌లు, ఫిల్టర్లు, AI అలంకారాలు లేకుండా కెమెరా కంటితో ఎలా చూశామో అలాగే బంధించి, ఆ క్షణంలో మన మనసులో కదిలిన భావాన్ని, అది తప్పైనా ఒప్పైనా అలాగే వెల్లడించే ఒక చిన్న ప్రయత్నమే ఇది.This is a small endeavor to capture the truth around us just as we saw it through the camera's eye, without any makeup, filters, or AI embellishments, revealing the emotion that stirred in our hearts at that exact moment, whether it feels right or wrong.
ప్రతి చిత్రానికి తోడుAccompanying each image
ఇక్కడ ప్రతి చిత్రమూ ఒంటరిది కాదు. దానికి తోడుగా ఒక కవితో, ఒక వాక్యమో, లేదా ఆ క్షణాన హృదయం పలికిన నిజాయితీ గల అనుభూతో రూపుకడుతుంది.Here, no picture stands alone. It is accompanied by a poem, a sentence, or an honest emotion spoken by the heart at that very instant.
గోప్యత మరియు బ్లర్Privacy and blur
గోప్యత కోసం అవసరమైన మేర బ్లర్ చేసుకునే వీలుంది.For privacy, there is an option to blur as much as necessary.
రచనలు మరియు స్వరాలుWritings and voices
పత్రిక వివిధ వ్యక్తుల రచనలు కలిగి ఉండవచ్చు. ప్రతి రచన దాని రచయిత అభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది, పత్రిక మొత్తం అభిప్రాయాన్ని కాదు.The magazine may feature writings from various contributors. Each piece reflects only its author's perspective, not the magazine's overall opinion.